ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని కాండ్లి గ్రామానికి చెందిన దాదాపు 100 మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని వారు తెలిపారు.