WGL: ఖిలా వరంగల్ మండలం తూర్పుకోట హనుమాన్ సెంటర్లో ఓట్ల చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేశ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానికుల నుంచి సంతకాలు సేకరించారు. ఓట్ల చోరీపై ఉద్యమించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.