NLG: అనుముల మండలం హాలియా పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా అడిషనల్ కలెక్టర్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అయిన అమిత్ నారాయణ సందర్శించారు. సందర్శనలో భాగంగా పాఠశాల మొత్తము కలియతిరిగి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.