నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ తన బలహీనతను ప్రదర్శించిందని మండిపడ్డారు. విదేశాల ఒత్తిడి కారణంగానే పాక్పై దాడులు చేయలేదని ఆ పార్టీ నేతే చెప్పారని తెలిపారు. ఫలితంగా పాక్లో ఉగ్రవాదం బలపడిందన్నారు.