TG: హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌తో మంత్రుల సమావేశం ముగిసింది. రేపు హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు రేపు మ.2:15 గంటలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ తెలిపారు. అయితే, నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లు కోరగా.. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.