SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్‌లో జరిగిన వాలీబాల్ జిల్లా స్థాయి పోటీల్లో ఆందోలు జట్టు ప్రథమ స్థానం సాధించింది. రెండో స్థానాన్ని చౌటకూరు మండల జట్టు దక్కించుకుంది. విజయం సాధించిన ఆందోలు జట్టును వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సుభాష్ గౌడ్, ఉపాధ్యక్షుడు సతీష్ గౌడ్ అభినందించారు.