ATP: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలకమండలి సభ్యులను ప్రభుత్వం నియమించింది. 16 మందితో నియామకం జరగగా.. తాడిపత్రికి చెందిన టీడీపీ మహిళా నేత పరిమి చంద్రకళకు పాలకమండలిలో చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆమె పాలకమండలి సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు.