MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో జగదాంబ భవాని మాత అమ్మవారికి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని ఉంచి పూరవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు ఆర్ఎస్ సంతోష్ కుమార్, శ్రీనివాస్, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.