W.G: భీమవరం మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు జవ్వాది గణేశ్వర కుమార్ తన అనుచరులు 300 మందితో గుట్లపాడు నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బుధవారం టీడీపీలో చేరారు. భీమవరం మండల టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జవ్వాది గణేష్ ఆయన అనుచరులకు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. టీడీపీ బలోపేతానికి కృషి చేశారన్నారు.