TG: రాష్ట్రంలో రేపటి నుంచి ZPTC, MPTC ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడత ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటల నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు మొదటి విడత నామినేషన్ల స్వీకరణ, తొలి విడతలో 292 ZPTC, 2,963 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.