E.G: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ పీఎండి ప్రసాద్ సూచించారు. బుధవారం ఉండ్రాజవరంలో ధాన్యం సేకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పీఎసీఎస్ అధికారులు, సిబ్బంది ధాన్యం కొనుగోళ్లలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం వ్యత్యాసం లేకుండా చూడాలని సూచించారు.