E.G: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో అక్రమ మందు గుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కొత్తపల్లి గ్రామంలో రెండు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడులో సుమారు రూ. 40,000 విలువగల అక్రమంగా నిల్వ ఉంచిన మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.