WGL: జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో రెండు కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈసీజీ డిప్లొమాలో 30 సీట్లు,డిప్లొమా డయాలసిస్‌లో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు నర్సంపేట మెడికల్ కాలేజీలో దరఖాస్తులను చేసుకోవచ్చని పేర్కొన్నారు.