JGN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ 26,27,977 సమకూరినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2025 మార్చి 21 నుంచి 2025 అక్టోబర్ 08 వరకు భక్తులు హుండీలో సమర్పించిన 201 రోజుల కానుకల ఆదాయాన్ని బుధవారం ఆలయం కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ ఎన్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు.