మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. పాక్ బౌలర్ల దాటికి ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఒక దశలో 115 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను.. బెత్ మూనీ (109), అలానా కింగ్ (51) కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో ఆదుకున్నారు.