NZB: రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పరామర్శించారు. గత నెల 29న ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిన అనంతరం, దినేష్ నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి సానుభూతి తెలిపారు.