NLG: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు పరంగా రైతులు అధైర్యపడోద్దని, అందరికి మద్దతు ధర చెల్లించబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.