BHNG: భువనగిరి బస్టాండ్ ఆవరణలో కలెక్టర్ హనుమంతరావు, డీపీఆర్డీ అరుంధతి ఆదేశానుసారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డ్రగ్స్, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై తమ ఆటపాటలతో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. భువనగిరి టౌన్ సీఐ రమేష్ హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్సై నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.