SRD: ఆరోగ్య భీమా పథకాన్ని అన్ని ఆసుపత్రులలో అమలు చేయాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పీ.రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం బీరంగూడలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి హాజరయ్యారు.