MBNR: దేశంలో ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందన్నారు.