HYD: సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతాలు, ఘట్కేసర్ నుంచి భువనగిరి వరకు రైల్వే సేఫ్టీ చెకింగ్ చర్యలు చేపట్టినట్లు SCR బుధవారం తెలిపింది. రెయిల్ మెన్, సేఫ్టీ చెకింగ్ బృందాలు దాదాపు 24 కిలోమీటర్ల మేరకు ట్రాక్ చెకింగ్ నిర్వహించినట్లుగా పేర్కొన్నాయి. రైల్వే భద్రతను మొదటి ప్రియారిటీ కింద తీసుకుని పనిచేస్తున్నట్లుగా DRM తెలిపారు.