VSP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాయ్పై జరిగిన దాడిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా కమిటీ సమావేశం తీవ్రంగా ఖండించింది. జిల్లా ఉపాధ్యక్షులు వైటీ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుకోటి చిరంజీవి మాట్లాడుతూ.. రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పడం సహించలేని వారు దాడులకు పాల్పడడం సరికాదన్నారు.