మేడ్చల్: మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 12 పనులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ, ముందుకు వెళ్లేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.