GNTR: తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని పంచగవ్య తయారీ కేంద్రాన్ని ఇవాళ సీపీఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రోప్రైటర్ సురేంద్ర రెడ్డి పంచగవ్య తయారీ విధానం, దాని ఉపయోగాలు, రైతులకు కలిగే లాభాలు వివరించారు. సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి పంచగవ్య వినియోగం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.