AP: కోనసీమ జిల్లాలో పేలుడు ఘటనపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కార్మికులు సజీవ దహనం కావడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశాంచారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.