MBNR: మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఎంపీడీవో గీతాంజలి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.