CTR: వ్యవసాయ అభివృద్ధికి రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు రెన్యువల్ చేసుకోవాలని డీసీసీ బ్యాంక్ గుడిపాల మేనేజర్ రఘుబాబు కోరారు. రైతులు సకాలంలో లోన్లు రెన్యువల్ చేసుకుంటే అధిక వడ్డీ భారం తగ్గుతుందని సూచించారు. బ్యాంకులో డిపాజిట్ ఖాతాలపై అధిక వడ్డీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.