ADB: ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు.