TG: బీసీ రిజర్వేషన్లపై పిటిషనర్లను ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే చివరి విచారణ కాదని.. అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని సూచించింది. తమ ఓపికను పరీక్షించకండంటూ పిటిషనర్లను ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించింది. గంటలకొద్దీ ఒకే అంశం ప్రస్తావించి, తమ సమయాన్ని వృథా చేయొద్దని చెప్పింది.