NLR: కొడవలూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10:30కు సమావేశం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న పలు ప్రధాన సమస్యలు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు తదితర విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరు హాజరు కావాలన్నారు.