TG: బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. ఇవాళ పిటిషనర్ తరపు న్యాయవాది, ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో రేపటి నోటిఫికేషన్ను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా.. ఈ వాదనలను కోర్టు పట్టించుకోలేదు. కాగా, రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.