GNTR: గుంటూరు నగరంలోని అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం స్వయంగా పరిశీలించారు. కాకుమానుగూడ, బీఆర్ స్టేడియం, పీవీకే నాయుడు పెద మార్కెట్, గోరంట్ల నీటి పథకం, మానస సరోవరం, నల్లపాడు చెరువు, ఐటీసీ రోడ్ తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.