మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ గోదావరిహోమ్స్లో రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ పార్కును ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరిహోమ్స్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గత పదేళ్లకాలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించామని, రానున్న రోజుల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు.