SKLM: మెలియాపుట్టి మండలం గంగరాజపురం గ్రామ పరిధిలో గల గ్రానైట్ క్వారీలో నిన్న పిడుగుపాటుకు గురై ముగ్గురు కార్మికులు మృతి చెందడం బాధాకరమని పాతపట్నం నియోజకవర్గం నియోజకవర్గ MLA మామిడి గోవిందరావు తెలిపారు. ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు బుధవారం అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కార్మికులకు సమయపాలనతో పాటు సరైన భద్రత కల్పించాలన్నారు.