KMM: ప్రజలతో అంటిపెట్టుకొని ఉండేవారినే స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవాలని CPI ML ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం సత్తుపల్లి మండలం సత్యంపేటలో జరిగిన ఎన్నికల జనరల్ బాడీసమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు వచ్చే నిధులను దుర్వినియోగం, అవినీతి లేకుండా వినియోగించినప్పుడే పల్లెలు కళకళలాడతాయని అన్నారు.