సత్యసాయి: హిందూపురం రూరల్ చౌళూరు గ్రామంలో వైసీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి మూడవ వర్ధంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కుటుంబ సభ్యులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ సీఎం జగన్ అనుచరుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన సేవలను గుర్తుచేశారు. గ్రామ ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.