W.G: ఆక్వా చెరువులు సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల ఆక్వా చెరువులను ఆక్వా కల్చర్ యాప్లో కింద నమోదు చేసుకోవడం జరిగిందని, ఇంకా 83 వేల ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. రిజిస్టర్ అయిన వారు మాత్రమే పవర్ సబ్సిడీ పొందగలరని అన్నారు.