సిరిసిల్ల విలీల గ్రామాలు చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడులో ధాన్యం పోయడానికి స్థలం కేటాయించాలని రైతులు అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ధాన్యం ఆరబోయడానికి భూమి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.