KNR: నగునూరు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. అంగన్వాడీలో భోజనం చేస్తున్న చిన్నారులతో ముచ్చటించారు. పిల్లల హాజరు, నమోదు, గర్భిణీ, బాలింతల సంఖ్య వంటి వివరాలు అంగన్వాడి టీచర్ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు వడ్డించిన భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడి పిల్లల హాజరు పెంచాలని ఆదేశించారు.