అనంతపురంలోని మారుతీనగర్‌లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మధుసూధన్‌రావు (47) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన వారం రోజులుగా ఆఫీస్‌కి రాకపోవడంతో సహోద్యోగులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు బుధవారం ఇంటికి వెళ్లి పరిశీలించిగా మధుసూధన్‌రావు శవమై కనిపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.