ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అధిక బరువు కారణంగా అతడు పోటీకి అనర్హుడిగా తేలడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బరువు పెరగడానికి అమన్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెజ్లింగ్ సమాఖ్య అతడిపై ఏడాది నిషేధం విధించింది.