ATP: శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన ముమ్మల్ల పృథ్వీరాజ్ ఎన్ఎస్ఎస్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు పొందారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనను అభినందించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.