BDK: టేకులపల్లి మండలంలోని బద్దుతండా, స్టేషన్ తడికలపూడి, గుండ్లమాడు, రోడ్డు గుంపుల గ్రామాల్లో వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశాలతో బుధవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, కాచి చల్లార్చిన నీటిని తాగడం గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు పెరిగే నీటి నిల్వలను ఎప్పటికప్పుడు నిర్మూలించాలని సూచించారు.