MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడో, అయిదో సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజుల గడువును బుధవారం అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ కళాశాలల్లో ఈనెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలని సూచించారు. రూ. 300 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.