MHBD: ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా PRTU TS లక్ష్యంగా పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు మిర్యాల సతీష్ రెడ్డి తెలిపారు. బుధవారం పెద్దవంగర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మండల అధ్యక్షులు గంగిశెట్టి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సతీష్ పాల్గొని మండల ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ యకూబ్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.