BHNG: మానసిక ఆరోగ్యంపై అవగాహన కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డా. అహెంతం శాంటా సింగ్ అన్నారు. బుధవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్య విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ ద్వారా రోగులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.