స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న హర్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. తాజాగా ఈ సినిమాపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో ఒకటి కాదు రెండు చార్ట్ బస్టర్ పాటలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. ఇక దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 జనవరి 9న విడుదల కాబోతుంది.