GNTR: వ్యవసాయ పనులు మొదలవడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ట్రాక్టర్లు, ఆటో డ్రైవర్లు కాసుల కోసం అధిక లోడుతో వ్యవసాయ కూలీల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. బుధవారం రెండు వాహనాల్లో ఎక్కించాల్సిన కూలీలను ఒకే వాహనంలో ఎక్కించి తీసుకువెళ్తున్నారు. డ్రైవర్ల ఈ తీరు మారకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.