SRD: విద్యార్థులకు నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ సమీపంలోని అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని పూర్తిస్థాయి సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.