SRPT: మఠంపల్లి మండలానికి 2400 మెట్రిక్ టన్నుల యూరియా రాగా, మరో 150 టన్నులు ఈ వారంలో రానున్నట్లు MRO మంగా నాయక్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విడతల వారీగా యూరియా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. రాబోయే సీజన్ కోసం యూరియా నిల్వ చేయొద్దని సూచించారు. ఎందుకంటే నిల్వ వల్ల గడ్డకట్టడం, నత్రజని శాతం తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని వెల్లడించారు.